YS Sharmila: అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయండి 24 d ago
మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆదాని రాష్ట్రంగా మార్చారని, సంతకం చేసే ఖాళీ చెక్ ఇచ్చినట్లు అదానీకి రాష్ట్రాన్ని దోచిపెట్టె యత్నం చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సోలార్ పవర్ డీల్ లోనే జగన్ కు రూ.1,750 కోట్ల లంచం వెళ్లిందని ఆరోపించారు. బుధవారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను షర్మిల కలిసి విద్యుత్ కొనుగోళ్లలో ఆదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని కోరారు.